ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత… ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే మార్చి రెండవ తేదీన…. జైల్లో శాఖ లో భర్తీ చేసే ఉద్యోగుల కోసం నిర్వహించే పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్టుల భర్తీకి మార్చి రెండవ తేదీన రాత పరీక్ష నిర్వహించాలని జైలు శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
గతంలో నిర్వహించిన డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 311 మందికి… మార్చి రెండవ తేదీన వాత పరీక్ష నిర్వహించబోతున్నారు. ఏకంగా 311 మంది నెల్లూరు జిల్లా మూలపేటలోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఫర్మేషన్ సర్వీసెస్ పాత సెంట్రల్ జైలు ఆవరణలో.. మార్చి రెండవ తేదీన పరీక్ష రాయవలసి ఉంటుంది. MLV అభ్యర్థులేమో ఉదయం 8 గంటలకు పరీక్ష రాయాల్సి ఉంటుంది.HMV అభ్యర్థులు మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరి పరీక్షకు హాజరు కావాలి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.