అందుకే పార్టీ మారుతున్నా..ఒక్కొక్కరి జాతకాలు బయటపెడ్తా : కరీంనగర్ మేయర్

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని విధంగా షాక్ తగిలింది. జిల్లాలో కీలకనేతగా ఎదిగిన కరీంనగర్ మేయర్ బీఆర్ఎస్ ను వీడుతున్నారు. నేడు (శనివారం) మేయర్ సునీల్ రావు ఆ పార్టీకి రాజీనామా చేసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో 10 మంది కార్పొరేటర్లతో బీజేపీలో చేరబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రంగం మొత్తం సిద్దమైంది.

ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తీవ్రస్థాయిలో అవినీతి పెరిగి పోయిందని, అది భరించలేకే తాను పార్టీని వీడతున్నానని కామెంట్ చేశారు. రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ, ఇతర పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ముఖ్యంగా ఓ అవినీతి నేత పేరును త్వరలోనే బయటపెడతానంటూ హాట్ కామెంట్‌ చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న ప్రతి నాయకుడి అవినీతి చిట్టా తన వద్ద ఉందని హెచ్చరించారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అందరి గుట్టు విప్పుతానంటూ మేయర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news