పద్మ అవార్డులకు మేము పంపిన పేర్లను కేంద్రం తీసుకోలేదు : సీఎం రేవంత్

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పద్మ అవార్డును ప్రకటించిన కేంద్రం తీరును తప్పుబట్టారు. ఆదివారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహా విష్కరణలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కేంద్రం శనివారం విడుదల చేసిన పద్మ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని పేర్కొన్నారు.


తాము పంపిన పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు ఇవ్వడాన్ని తాను..స్వాగతిస్తున్నానని ఇది అబినంధించాల్సి విషయమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడంపై త్వరలో కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. యూనివర్సిటీల నుంచి విద్యార్థి ఉద్యమకారులు, నాయకులు రావాలని పిలుపునిచ్చారు. అలాగే అంబేద్కర్ వర్సిటీలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news