మా చుట్టాలకు రైతు భరోసా ముందు ఇవ్వాలని అధికారులను నేను చెప్పా : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

-

రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి రైతుభరోసా నిధులను ఆ గ్రామంలోని రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాలు, చుట్టాలు ఉన్న గ్రామాలకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ముందు మా సుట్టాలున్న గ్రామానికి రైతు భరోసా ఇవ్వాలని అధికారులకు తానే చెప్పినట్లు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. మండలానికి ఒక గ్రామం చొప్పున రైతు భరోసా నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించగా రాత్రికి రాత్రే లిస్ట్ కావాలంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లెంల గ్రామానికి ఇవ్వాలని అధికారులకు చెప్పా..ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏమో తమ చుట్టాలు ఉన్న మసీద్ గూడ గ్రామానికి ఇవ్వాలని RDOకి చెప్పారని తెలుస్తోంది. తెలంగాణలోమొత్తం 12,774 గ్రామాలకు గాను 577 గ్రామాలకు అంటే 4.5 శాతం గ్రామాలకు రూ.569 కోట్లు రైతు భరోసా నిధులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news