కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి ఆలయ పరిసరాల్లో కత్తితో హల్చల్ చేసిన అఘోరీపై పోలీసులు తాజాగా కేసు ఫైల్ చేశారు. టెంపుల్ వద్ధ కత్తితో సంచరించడంతో పాటు ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన ఘటన, దానిని వీడియో తీస్తున్న ఓ రిపోర్టర్ మొబైల్ ధ్వంసం చేసిన ఘటనలో సిద్దిపేట సీపీ ఆదేశాలతో చేర్యాల పోలీసులు 4 సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మంగళవారం కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చిన అఘోరీ ఆలయ ప్రధాన ద్వారం గుండా స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని పట్టుబట్టింది.వస్త్ర ధారణతో రావాలని ఆలయ అధికారులు ఆమెకు సూచించారు. దీంతో వారితో వాగ్వాదానికి దిగింది. అదే టైంలో ఆలయానికి వచ్చిన అఘోరిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు.ఆమె ఆశీర్వాదం కోసం భారీగా జనాలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.