ఏపీ ప్రభుత్వానికి ఊరట.. కొత్త డీజీపీ నియామకంపై వేసిన పిటిషన్ కొట్టివేత

-

ఏపీ ప్రభుత్వానికి ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఈ నెల 31న పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో కొత్త డీజీపీ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. బుధవారం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పిల్‌ను డిస్మిస్ చేసింది.తీర్పు విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోర్టు సూచించింది.

కాగా, ఏపీ ప్రభుత్వం నూతన డీజీపీ ఎంపికలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్, యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రూల్స్ మేరకు అన్ని అర్హత ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారుల లిస్ట్‌ను ప్రభుత్వం యూపీఎస్సీ‌కి రిఫర్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ముగ్గురు అధికారులతో కూడా జాబితాను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా వారిలో ఏ ఒక్కరికీ డీజీపీగా అవకాశం ఇవ్వకుండా జూనియర్లకు ఆ పదవిని ఎలా కట్టబెడతారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిల్‌ను హైకోర్టు డిస్మిస్ చేసినందున పిటిషనర్ సుప్రీంను ఆశ్రయిస్తారా? లేదా అనేది వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news