ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది. ఏపీలో భర్తీ చేయబోతున్న 6100 కానిస్టేబుల్ పోస్టులపై… కీలక ప్రకటన చేసింది. ఏపీలో భర్తీ చేయబోతున్న కానిస్టేబుల్ కోసం… నిర్వహించిన పిఈటి అలాగే పిఎంటి పరీక్షలు నిన్నటితో ముగిసినట్లు తెలిపింది. 69K మంది ఈ పరీక్షలకు హాజరైనట్లు వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ.
ఇక ఇందులో 39 వేల మంది మాత్రం అర్హత సాధించినట్లు… పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ రవి ప్రకాష్ ప్రకటన చేశారు. వీరందరికీ మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ ఫస్ట్ వారంలో… తుది రాత పరీక్ష ఉంటుందని… దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని ఆయన ప్రకటన చేశారు. ఇక హోంగార్డుల రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తామని చైర్మన్ రవి ప్రకాష్ తెలపడం జరిగింది. ఇక ఈ పోస్టులకు 2023 ఫిబ్రవరిలో… దాదాపు నాలుగు లక్షలకు పైగా మంది పరీక్ష రాశారు.