సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి వరుసగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ప్రభుత్వంలో తిరుపతి రెడ్డి పాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నది. ఆయన కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. అలాంటప్పడు ఎందుకు ప్రభుత్వంలో ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నిస్తోంది.
తాజాగా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్ద్యాలలో ఏర్పాటు చేసిన ఎంపీడీవో కార్యాలయాన్ని అనుముల తిరుపతిరెడ్డి ప్రారంభించారు.అంతేకాకుండా 13 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కనీసం వార్డ్ మెంబర్ పదవి కూడా లేని తిరుపతి రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు.