తాను ఉగ్రవాదిని కాదని.. తనకు ఉగ్రవాద సంస్థలతో ఎటువంటి సంబంధం లేదని వరంగల్ వాసి జక్రియా వెల్లడించారు. శ్రీలంకకు బంధువులతో వెళ్తున్నప్పుడు చెన్నై ఇమ్మిగ్రేషన్ అధికారులు వరంగల్ వాసి జక్రియాను అదుపులోకి తీసుకుని గురువారం వదిలేసినట్లు తెలుస్తోంది.
వ్యక్తిగత పనిపై శ్రీలంకకు వెళ్తున్న తనపై తప్పుడు ప్రచారం చేశారని బాధితుడు పేర్కొన్నాడు.జమాతే ఇస్లామి హింద్ సంస్థతో పాటు ఏ విదేశీ సంస్థలతోనూ తనకు సంబంధాలు లేవని, తాను హోటల్ నడుపుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నానని జక్రియా పేర్కొన్నాడు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారని బాధితుడు వెల్లడించారు.
నేను ఉగ్రవాదిని కాదు
తనకు ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పిన వరంగల్ వాసి జక్రియా
శ్రీలంకకు బంధువులతో వెళ్తున్నప్పుడు చెన్నై ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న వరంగల్ వాసి జక్రియాను గురువారం వదిలేశారు
వ్యక్తిగత పనిపై శ్రీలంకకు వెళ్తున్న తనపై తప్పుడు ప్రచారం… https://t.co/VbAefbqozO
— Telugu Scribe (@TeluguScribe) January 31, 2025