రేవంత్‌ సీఎం పదవి ఊడిపోవడం ఖాయం – తాటికొండ రాజయ్య సంచలనం!

-

రేవంత్‌ సీఎం పదవి ఊడిపోవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తాటికొండ రాజయ్య. మాదిగలతో పెట్టుకుంటే నీ సీఎం పదవి ఊడిపోవడం ఖాయం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య హెచ్చరికలు జారీ చేశారు. హన్మకొండ బీఆర్‌ఎస్ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన తాటికొండ రాజయ్య… సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Former Deputy Chief Minister Tatikonda Rajaiah’s warning to CM Revanth Reddy

ఎస్సీ వర్గీకరణ విషయంలో…సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ విమర్శలు చేశారు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య. మాలల ఒత్తిడికి తలొగ్గుతున్నారంటూ ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి అంతుకూడా చూస్తానని వార్నింగ్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైపోయిందని ఫైర్ అయ్యారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్‌ ఓటమి ఖాయం.. కేసీఆర్‌ సీఎం అవడం గ్యారెంటీ అన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య.

Read more RELATED
Recommended to you

Latest news