ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

-

రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలంలో వెలుగుచూసింది. శుక్రవారం ఉదయం బోథ్ -నిర్మల్ రహదారిపై ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధుడు మృతి చెందగా, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగంగా ఉన్నట్లు సమాచారం. బస్సును ఆటోను ఢీకొని ముందుకు వెళ్లగా..ఆటో బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది.స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆటో డ్రైవర్ తప్పు దారిలో రావడం వల్లే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ డ్రైవర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news