తెలంగాణ సీఎం రేవంత్‌కు మరోసారి అవమానం ఎదురైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మర్చిపోయారు. మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పేరుకు బదులు కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి నాలుక కరుచుకున్నారు. ఆ తర్వాత సారీ చెప్పడం గమనార్హం.
దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును పదే పదే మరిచిపోతూ ఆయన్ని అవమానాల పాలు చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్, బాల ఆదిత్య లాంటి హీరోలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మర్చిపోయారు. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి పేరును మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మర్చిపోవడంతో.. గులాబీ పార్టీ నేతలు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా అంటూ వీడియోలు వైరల్ చేస్తున్నారు.
జగ్గారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం pic.twitter.com/C1TEvr2S0S
— AR (@AshokReddyNLG) February 1, 2025