తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.….స్థానిక దర్శన టికెట్ల జారీలో మార్పులు చేసింది టీటీడీ పాలక మండలి. ఈ నెల 4వ తేదీ రథసప్తమి కారణంగా ఫిబ్రవరి నెలలో రెండో మంగళవారం స్థానికులు దర్శనం కల్పిస్తున్నారు టిటిడి పాలక మండలి అధికారులు. ఈ నెల 4వ తేదీకి బదులుగా 11వ తేదీన స్థానిక దర్శనం కల్పించనున్నారు టీటీడీ అధికారులు. ఇక ఈ నె 9వ తేదీన స్థానిక దర్శనం భక్తులకు టోకెన్లు జారి చెయ్యనుంది టిటిడి.
కాగా….తిరుమలలో 06 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. అలాగే… టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనం కు 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 80871 మంది భక్తులు దర్శించుకున్నానరు. 24257 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే.. హుండీ ఆదాయం 3.78 కోట్లుగా నమోదు అయింది.