టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. రాహుల్ ద్రావిడ్ కారుకు తాజాగా ప్రమాదం జరిగింది. బెంగళూరులో ఓ వీధిలో వెళ్తున్న రాహుల్ ద్రావిడ్ కారును మరొక ఆటో ఢీ కొట్టింది. దీంతో రాహుల్ ద్రావిడ్ కారు ముందు భాగం.. తుక్కు తుక్కు అయింది. అయితే ఈ ప్రమాదంలో రాహుల్ ద్రావిడకు ఎలాంటి గాయాలు జరగలేదు.
కానీ ప్రమాదం జరిగిన తర్వాత ఆటోడ్రైవర్ తో రాహుల్ ద్రావిడ్ గొడవకు దిగాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ తర్వాత…. ఇద్దరు శాంతించి రాజీకి వచ్చినట్లు సమాచారం.
రాహుల్ ద్రవిడ్ కారుకు ప్రమాదం..
బెంగళూరులో ద్రవిడ్ కారును ఢీకొట్టిన ఆటో
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది pic.twitter.com/pgHFU7Zshw
— BIG TV Breaking News (@bigtvtelugu) February 5, 2025