ప్రకృతి అందించే ప్రతీది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నాచురల్ ఫుడ్స్ మనిషిని బలంగా మార్చుతాయి. బయట తిరిగే వాళ్లు ఎక్కువగా దాహం వేస్తే శీతలపానియాలు తాగడానికి ఇష్డపతారు.. కొందరు మాత్రమే లెమన్ జ్యూస్, చెరకు రసం లాంటివి తాగుతారు. చెరకు రసం కేవలం దాహాన్ని మాత్రమే తీర్చదు..ఇందులో ఎన్నో లాభాలు ఉన్నాయి. చెరకు ఉత్పత్తిలో ఇండియాది రెండవ స్థానం. చెరుకు రసంలో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ తో పాటు అనేక ఇతర అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇంకా ఇది కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది.
చెరకు రసం వల్ల ఉపయోగాలు..
- చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది.
- అలసటగా నీరసంగా అనిపించినప్పుడు చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు.
- చెరుకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా, మేలైన నిగారింపు సంతరించుకుంటుంది.ముఖంపై ఏర్పడే మొటిమలు తగ్గుతాయి.
- చెరుకు రసం తాగడం వలన వీర్యకణాల నాణ్యత పెరగడంతోపాటు సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయని అధ్యయనాల్లో తేలింది.
- వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది.
- బాలింతలు చెరుకు రసం తాగడం వలన వాళ్లలో పాల ఉత్పత్తి అధికం అవుతుంది.
- చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కొత్త కణాలకు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది.
- మూత్రపిండాలు, కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.
- చెరుకులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. శరీరం నుండి అనవసరమైన నీటిని బయటకు పంపుతుంది.
- చెరకు రసంలో కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఉండటం వల్ల పళ్లపై ఎనామిల్‌ను బలోపేతం చేస్తుంది.
- చెరకు రసం నోటి దుర్వాసన సమస్యను కంట్రోల్ చేస్తుంది.
- కడుపులో పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
- చెరకు రసం క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.
గ్లాసుడు చెరుకు రసంలో బారెడు లాభాలు…సింపుల్‌గా తీసుకోకుండా.. వీలైనప్పుడల్లా చెరకు రసం తాగేందుకు ప్రయత్నించండి. చెక్కర ఎక్కువగా ఉన్న శీతలపానియాలు తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకునే బదులు కమ్మగా చెరకు రసం తాగి చూడండి. ఎన్ని లాభాలో..!