భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న జాకీర్ హుస్సెన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానీయుడి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ మేరకు సీఎం రేవంత్ బృందం శనివారం జాకీర్ హుస్సెన్ కు నివాళి అర్పించిన వివరాలను ఎక్స్ వేదికగా సీఎంవో ఆఫీస్ వెల్లడించింది.
స్వాతంత్య్ర సమర యోధుడిగా, దేశంలో విద్యా రంగం అభివృద్దికి గొప్ప కృషి చేసిన విద్యావేత్తగా డాక్టర్ జాకీర్ హుస్సెన్ ఎన్నో సేవలు అందించారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కుందూరు రఘువీర్ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.