ఢిల్లీలో కాంగ్రెస్‌ గుండు సున్నా… స్పందించిన సీఎం రేవంత్‌ !

-

ఢిల్లీలో కాంగ్రెస్‌ గుండు సున్నా రావడంపై స్పందించారు సీఎం రేవంత్‌ రెడ్డి. కేంద్రాన్ని ఎదుర్కోవడానికి ఇండియా కూటమి…. కానీ కేజ్రీవాల్ కూటమిని డిస్ట్రబ్ చేశారని ఆగ్రహించారు. హర్యానాలో కేజ్రీవాల్ డిస్ట్రబ్ చేశారు… అక్కడ బీజేపీ లాభపడిందని గుర్తు చేశారు. ఢిల్లీలో ప్రజలు పొజిషన్.. అపోజిషన్ లాగే చూశారన్నారు. అందుకే బీజేపీ అప్ పార్టీల మధ్య పోటీ జరిగిందని వివరించారు.

revanth-reddy

కేజ్రీవాల్… యాంటీ కేజ్రీవాల్ లాగే పోలింగ్ జరిగిందని వివరించారు. దీంతో… కేజ్రీవాల్ యాంటీ ఓటు బీజేపీ పార్టీకి వెళ్ళిందని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కూడా అలాగే జరిగిందని వివరించారు. కేంద్రం మాకు సహకరించడం లేదని ఆగ్రహించారు. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదు.. దక్షిణాది రాష్ట్రాల మీద ఎందుకు వివక్ష అంటూ నిలదీశారు రేవంత్‌ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని మోడీ ప్రమాదకరం అన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news