రియల్ ఎస్టేట్‌ వ్యాపారుల ఆత్మహత్యలకు రేవంతే కారణం – హరీష్‌ రావు

-

రియల్ ఎస్టేట్‌ వ్యాపారుల ఆత్మహత్యలకు రేవంతే కారణం ఆగ్రహించారు మాజీ మంత్రి హరీష్‌ రావు. రియల్ ఎస్టేట్ రంగంలో కాంగ్రెస్ డిజాస్టర్ అయిందని.. మొన్న కొంపల్లిలో రాయల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య, నేడు ఆదిభట్లలో నరసింహ గౌడ్ ఆత్మహత్య అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లతో మొదలైన ఆత్మహత్యల పరంపర రియల్ ఎస్టేట్ రంగానికి చేరడం దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పాలన పాపం అన్ని రంగాలకు శాపంగా మారింది. ఎంతోమంది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నదని… గతం ఎంతో ఘనం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం.. అన్నట్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితిని మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ గ్రోత్ ఇంజన్ అయిన హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమని… గడిచిన ఏడాదిన్నరగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని పలు సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏలాంటి నష్ట నివారణ చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అంటూ నిప్పులు చెరిగారు.నిజాన్ని దాచిపెడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి దిశలో వెళ్తుంది అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్ప చేస్తుందేమీ లేదన్నారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news