మద్యం షాపు టెండర్లు.. షాప్ దక్కించుకున్న మహిళపై వైసీపీ నేత దౌర్జన్యం

-

ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మద్యం షాపు టెండర్లలో గీత కార్మికులకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే, గీత కార్మికులకు రిజర్వ్ చేయబడిన షాపులకు సంబంధించి లక్కీ డిప్ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో పాలసముద్రం మండలంలో నిర్వహించిన లాటరీలో డిప్‌లో ఓ వైన్‌షాప్‌ను వెదురు కుప్పంకు చెందిన అలేఖ్య దక్కించుకున్నారు.

Wines Association warning to stop buying liquor

అయితే, ఆ మహిళ మీద YSRCP నాయకుడు రమేష్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నట్లు సమాచారం. డిప్ ద్వారా దక్కించుకున్న షాపు నాకే ఇవ్వాలంటూ ఆమెకు హుకుం జారీచేశాడు.రమేష్ రెడ్డి‌తో పాటు కృష్ణారెడ్డి కూడా తనను బెదిరిస్తున్నారని, వారిద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ చిత్తూరు పోలీస్‌స్టేషన్లో వైన్ షాప్ యజమాని అలేఖ్య ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news