పోలీసుల పహారాతో కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సర్వే

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం, ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. మొన్నటివరకు లగచర్లలో భూములు ఇచ్చేందుకు గ్రామస్తులు వెనకాడారు. ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. తాజాగా నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూములు ఇచ్చేందుకు అక్కడి రైతులు, ప్రజలు నిరాకరిస్తున్నారు.

అధికారులు భూ సర్వే కోసం వస్తే వారిని ముట్టడించి వెనక్కి వెళ్లేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎంత వ్యతిరేకత ఎదురైనా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే పోలీసుల బందోబస్త్ నడుమ నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ సర్వేను నిర్వహిస్తోంది. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బాపూర్ గ్రామ శివార్లలో నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతుల పథకం కోసం అధికారులు భూ సర్వే చేస్తున్నారు. కాగా, ఈ భూ సర్వేని బాపూర్, తిప్రాస్ పల్లి గ్రామ రైతులు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news