రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాదు నుండి కొచ్చిన్ బయలుదేరి వెళ్లనున్నారు ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇన్ని రోజులు జ్వరం కారణంగా ఆయన షెడ్యూల్స్ అనేవి వాయిదా పడ్డాయి. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జ్వరం నుండి కోలుకుంటూ ఉండటంతో ఆయన పర్యటన షెడ్యూల్ అనేది సిద్ధం అయ్యింది. రేపటి నుంచీ దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన మొదలు కానుంది.
ఈ మూడు రోజులపాటు దక్షిణాది ఆలయాలను సందర్శించనున్నారు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్. గతంలో ఆయన మొక్కుకున్న మొక్కులు అన్ని తీర్చుకోవడానికి ఈ పర్యటనకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్. అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరసురామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాల సందర్శన చేయనున్నారు పవన్. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పటికే సనాతన ధర్మ బోర్డు ఏర్పాటుకు డిప్యుటీ సీఎం పవన్ సంకల్పించిన విషయం తెలిసిందే,