ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యాత్మిక పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకీరా నందన్‌తో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరుకు వెళ్లారు.
అక్కడ శ్రీస్వామినాథ స్వామి (కుమారస్వామి)ని పవన్,అకీరా నందన్ ఇద్దరూ దర్శించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం రాక సందర్భంగా ఆలయ పండితులు వీరి కోసం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను పవన్ సందర్శిస్తారని సమాచారం. నిన్న ఆయన కేరళలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. కాగా, మొత్తం నాలుగు రోజుల పాటు ఆయన దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నారు.
తమిళనాడు, తంజావూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర
అక్కడ శ్రీస్వామినాథ స్వామి (కుమారస్వామి)ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్, ఆయన కుమారుడు అకీరా నందన్ pic.twitter.com/wNrYxZudDe
— Telugu Scribe (@TeluguScribe) February 13, 2025