ఓవర్ స్పీడుతో కార్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్ వర్క్.. పోలీసులు ఏం చేశారంటే?

-

డ్రైవింగ్ చేస్తూ ఫోన్లు మాట్లాడకూడదని, ఇతర పనులు చేయరాదని ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొందరు వినిపించుకోవడంలేదు. అందులోనూ చదువుకున్న వారైతే మరీ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. వీరికంటే ఒక్కోసారి చదువుకోని వారే బెటర్ అనేలా వీరి చేష్టలు ఉంటున్నాయి.

బెంగళూరులోని ఆర్టీనగర్ ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తూ ల్యాప్‌ టాప్‌లో ఓ మహిళా టెకీ వర్క్‌ చేసింది.అంతేకాకుండా ఓవర్ స్పీడ్‌గా వాహనం నడుపుతున్నది. పక్కనే వెళ్లే ఓ వాహనదారుడు ఈ తతంగాన్ని వీడియో తీసి ట్రాఫిక్ విభాగానికి అటాచ్ చేయడంతో ఓవర్‌ స్పీడింగ్‌, డ్రైవింగ్‌లో అలసత్వం ప్రదర్శించిన ఆమెకు పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధించారు.దీనికి సంబంధించి నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘ఎక్స్‌’లో బెంగళూరు నార్త్ ట్రాఫిక్‌ డీసీపీ పోస్టు పెట్టారు.ఇది కాస్త వైరల్ అవుతోంది.

https://twitter.com/ChotaNewsApp/status/1889922784186556728

Read more RELATED
Recommended to you

Latest news