రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. మహబూబాబాద్ పట్టణ శివారు సాలార్ తండాలో వలిగొండ నుంచి భద్రాచలం (P-930) జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది.
అయితే,జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ భూములు తీసుకుంటే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. అంతేకాకుండా వారిని చుట్టుముట్టారు. రహదారి నిర్మాణంలో తమ భూములు కోల్పోతామని తండా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, భారీ పోలీస్ పహారా నడుమ అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు
మహబూబాబాద్ పట్టణ శివారు సాలార్ తండాలో వలిగొండ నుండి భద్రాచలం (P-930) జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు
భారీ పోలీస్ పహారా నడుమ సర్వే… pic.twitter.com/iKsFuvFW5o
— Telugu Scribe (@TeluguScribe) February 13, 2025