ప్రకాశం జిల్లాలో గురుమూర్తి కేసు రిపీట్ అయింది. ప్రకాశంలో కొడుకు చంపి, ముక్కలుగా చేసింది తల్లి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కన్న కొడుకును హత్యచేయించింది తల్లి. ప్రకాశం జిల్లాలో చెందిన సాలమ్మకు నలుగురు పిల్లలు ఉన్నారు.. మూడో వాడైన శ్యాంబాబు(35) మద్యానికి బానిసై దొంగతనాలు కూడా చేసేవాడు. అయితే… కొద్దిరోజుల కిందట మద్యం మత్తులో బంధువుల అమ్మాయితోను, చివరికి తల్లితోను అసభ్యంగా ప్రవర్తించాడు.
దీంతో విసిగిన పోయి ఒక ఆటో డ్రైవర్ కు సుపారి ఇచ్చి, కొడుకును ముక్కలుగా నరికి పంట కాలువలో పడేసింది తల్లి లక్ష్మి. కాల్వగట్టుపై రక్తపు మరకలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఇక పోలీసు విచారణలో నేరం అంగీకరించింది తల్లి లక్ష్మి. ఇద్దరు సోదరులు మరొక వ్యక్తి సహాయంతో హత్య చేయించింది తల్లి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కన్న కొడుకును హత్యచేయించిన తల్లి
ప్రకాశం జిల్లాలో చెందిన సాలమ్మకు నలుగురు పిల్లలు.. మూడో వాడైన శ్యాంబాబు(35) మద్యానికి బానిసై దొంగతనాలు కూడా చేసేవాడు
కొద్దిరోజుల కిందట మద్యం మత్తులో బంధువుల అమ్మాయితోను, చివరికి తల్లితోను అసభ్యంగా… pic.twitter.com/QKLj6FjAIV
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2025