బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి

-

హైదరాబాద్ – లాలాగూడ లోని దారుణంలో జరిగింది. బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి చేశాడు. హైదరాబాద్ – లాలాగూడ లోని సూపర్ స్టార్ హోటల్ లో బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడికి దిగారు. రాడ్డుతో హోటల్ సిబ్బందిపై దాడి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేశాడు ఓ దుండగుడు.

అయితే.. ఈ సంఘటన లో హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రతి రోజు తనకు బిర్యానీ ఇవ్వాలని బెదిరిస్తున్నాడని, ఇవ్వకపోతే దాడులకు దిగుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది హోటల్ యాజమాన్యం. దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు లాలాగూడ పోలీసులు. ఇక బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి చేసిన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news