జగిత్యాల జిల్లా ఏరియా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వలన ఓ యువకుడు మృతి చెందాడు. జగిత్యాల రూరల్ మండలం తాటిపెల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఓ యువకుడిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేయకుండా సెక్యూరిటీని పిలిపించి బయటకు పంపించడంతో గాయాల పాలైన యువకుడు మృతి చెందినిట్లు తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు వైద్యుల నిర్లక్ష్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జగిత్యాల జిల్లా ఏరియా ఆస్పత్రిలో దారుణం
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన యువకుడు
జగిత్యాల రూరల్ మండలం తాటిపెల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఓ యువకుడిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు
ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేయకుండా సెక్యూరిటీని… pic.twitter.com/SPHCBulbi5
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2025