‘సాక్షి’కి ఏపీ శాసనసభ ఊహించని షాక్ ఇచ్చింది. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని ఏపీ శాసనసభాపతి అయ్యనపాత్రుడు నిర్ణయించారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించకుండా రూ. కోట్లు వెచ్చించారంటూ ‘సాక్షి’లో కథనం ప్రచురించడాన్ని.. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు.

సభాపతి నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రిక, మీడియాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.