హైదరాబాద్ అల్లాపూర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని సిటీ వాసుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వివరాల్లోకివెళితే.. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ నగర్‌లో నివాసముంటున్న భాను (24) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి కత్తులతో పొడిచి, బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. అయితే, భానుపై గతంలో బోరబండ, సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు ఉన్నట్టు పోలీసులు నిర్దారించారు. పాత కక్ష్యల నేపథ్యంలోనే ఈ మర్డర్ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
రోజు రోజుకి నగరం లో అధ్వాన్నంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి
హైదరాబాద్ అల్లాపూర్‌లో యువకుడి దారుణ హత్య
అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ నగర్‌లో భాను (24) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి కత్తులు, బండరాళ్లతో దారుణంగా హత్య
భానుపై గతంలో బోరబండ, సనత్‌నగర్… pic.twitter.com/9velMjceXW
— PulseNewsBreaking (@pulsenewsbreak) February 25, 2025