చంద్రబాబు, పవన్ లను కుల ప్రాతిపదికన జనగణన చేయాలని కోరడానికి కలిసాను. బీసీలకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని అడిగాను అంటూ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తెలిపారు. అయితే కర్నూలు దగ్గర పెదపాడు విలేజ్ కి దామోదర సంజీవయ్య పేరు పెట్టాలి.. ఆ ప్రాంతం లో స్మృతి వనం కట్టాలి. అందుకు పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. కానీ గతంలో జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఆయన నీతి నిజాయితీ కల్గిన వ్యక్తి.. చనిపోయినప్పుడు కూడా సొంత ఇల్లు లేదు. కాబట్టి ఆయనకి న్యాయం జరగాలి. రాజకీయలలో డబ్బులు సంపాదించడం ఒక సిస్టం అయ్యింది. ఇందులో పవన్ చొరవ తీసుకోవాలి, సహకరించాలి. జనగన తో పాటు కులగన కూడా జరగాలి పవన్ ని కోరుతున్నా. అయితే పవన్ కి మోడీ తో సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పిన హనుమంతరావు.. ఏపీలో కాంగ్రెస్ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది అని పేర్కొన్నారు.