పోసాని కృష్ణమురళిని నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులో ఉన్న పోసాని కృష్ణ మురళిని… ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. శివరాత్రి పండుగ అని చూడకుండా… దౌర్జన్యంగా పోసాని కృష్ణ మురళిని ఏపీకి తరలించారు పోలీసులు. ఈ తరుణంలోనే ఇవాళ.. అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లెకు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని తరలించారు. నిన్న రాత్రి గచ్చిబౌలిలో పోసానిని అరెస్టు చేసి నేరుగా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తరలించడం జరిగింది.

ఇక మరికాసేపట్లో రైల్వే కోడూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్ళనున్నారు పోలీసులు. రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోసాని కృష్ణ మురళికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం పోసాని కృష్ణమురళిని కోర్టు ముందు హాజరు పరుస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట పోసాని కృష్ణ మురళి. ఈ నేపథ్యంలోనే ఏపీలో పలు కేసులు కూడా పోసాని కృష్ణ మురళి పై నమోదు అయినట్లు చెబుతున్నారు. దీంతో ఆయనను అరెస్టు చేశారు.