అరేబియా సముద్రంలో బోటు ప్రమాదం.. చిక్కుకున్న శ్రీకాకుళం మత్స్యకారులు

-

అరేబియా సముద్రంలో బోటు ప్రమాదం సంభవించింది.ప్రమాదవశాత్తు మత్స్యకారుల బోటులోకి నీళ్లు వచ్చాయి. దీంతో బోటు కాస్త ఒకవైపునకు వంగిపోయింది. ఈ క్రమంలోనే తమ ప్రాణాలను రక్షించుకునేందుకు మత్స్యకారులు సముద్రంలోకి దూకారు.

అక్కడే ఉన్న మరో బోటు మత్స్యకారులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అందులోని తోటి మత్స్యకారులు తాళ్ల సాయంతో నీళ్లలో దూకిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. నీట మునిగిన బోటు ఏపీలోని శ్రీకాకుళం వాసులదిగా గుర్తించారు. బోటు నీట మునుగుతుండగా.. సహాయక చర్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, బోటు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news