మార్చి 30న ఉగాది అవార్డులు.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చేనెలలో ఉగాది పండుగ సందర్భంగా.. మార్చి 30న రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేస్తామన్నారు.

వివిధ కళారంగాల్లో నిష్ణాతులు, కవులను కళారత్న, ఉగాది పురస్కారలతో సత్కరించనున్నట్లు ఆ సమతి సీఈవో మల్లికార్జున రావు తెలిపారు. దరఖాస్తులను మార్చి 15వ తేదీలోపు విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత డాన్స్ కాలేజీలో నేరుగా లేదా [email protected]కు పంపాలని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news