బీఆర్ఎస్ మేధావులకు కామన్‌సెన్స్ ఉందా? : మంత్రి జూపల్లి

-

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రమాదానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తుండగా.. గత బీఆర్ఎస్ హయాంలో పని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే టన్నెల్ కూలిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.

తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఘటనపై స్పందస్తూ బీఆర్ఎస్ సీనియర్ నేతలపై విరుచుకపడ్డారు. ‘ఆ మేధావులకు కామన్‌సెన్స్ ఉందా? లక్షా 70 వేల కోట్లకు టెండర్లు పిలిచి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన మీరు ఇంత సింపుల్, ఈజీ ప్రాజెక్టును మూలనపడేశారు. దీనికి కేసీఆర్, హరీశ్ రావు బాధ్యులు కాదా? మేధావి మాటలు మాట్లాడేవాళ్లకు కామన్‌సెన్స్ లేదా? నల్గొండ ప్రజలు మీకు ఓట్లేయలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news