కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ నేతలపై దాడి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే

-

కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని, ఆ పార్టీ నేతలు ఎన్ని దాడులకు చేస్తున్నా పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారని విమర్శించారు. ప్రజాపాలన అంటే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజల గొంతు వినిపించిన వారిపై విచక్షణా రహితంగా దాడిచేయడమేనా? ఇందిరమ్మ రాజ్యం నాటి ఎమర్జెన్సీ రోజులకు కొల్లాపూర్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

పదేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫ్యాక్షన్ తరహా దాడులు పెరిగిపోయాయన్నారు. మంత్రి జూపల్లి అండదండలతోనే ఈ విష సంస్కృతి రోజురోజుకూ పెరిగిపోతోందని విమర్శించారు. ఇలాంటి దాడులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదన్నారు.ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటామని చెప్పారు. ఇప్పటికైనా పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news