కామారెడ్డి జిల్లాలో జోరుగా ఇసుక, మొరం అక్రమ రవాణా జరుగుతున్నట్లు స్థానికులు పెద్దఎత్తున ఆరోపిస్తున్నారు.మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివ నగర్ మండలాల్లో జోరుగా అక్రమ ఇసుక,మొరం రవాణా జరుగున్నట్లు సమాచారం. రామారెడ్డి మండలం రెడ్డి పేట, మద్దికుంట అటవీ ప్రాంతంలో భారీగా ఇసుక డంపులు ఉన్నట్లు తెలుస్తోంది.
వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలించి మాఫియా డంప్ చేస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు, ఎమ్మార్వో పట్టించుకోవడం లేదని, వారి కనుసన్నలలోనే మొరం, ఇసుక దందా జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక ఫారెస్ట్ మైనింగ్,అధికారులు కూడా పట్టించుకోవడం లేదని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.