SLBC: నాలుగు మృతదేహాలు తీస్తామని చెబుతున్న అధికారులు.. మిగితా నాలుగు మృతదేహాలు డౌటే అంటున్నారు. SLBC టన్నెల్లో జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో కొనసాగుతున్నాయి తవ్వకాలు. జీపీఆర్ ద్వారా 2 మీటర్ల లోతులో 4 బాడీస్.. మరో 7 మీటర్ల లోతులో ఇతర 4 మృతదేహాలు గుర్తించారని సమాచారం అందుతోంది.

మరికొన్ని గంటల్లో.. 2 మీటర్ల లోతులో గుర్తించిన 4 మృతదేహాలను వెలికి తీయనున్నాయి రెస్క్యూ టీమ్స్. అయితే.. 7 మీటర్ల లోతులో చిక్కుకున్న 4 మృతదేహాలను తీయడం అసాధ్యం అంటున్నాయి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ సిబ్బంది. అటు నాలుగు మృతదేహాలు వస్తాయని సిద్ధంగా ఫోరెన్సిక్, వైద్య బృందాలు ఉన్నాయి.. 4 బాడీస్‌కి సొంత గ్రామాలకు పంపేందుకు అంబులెన్స్‌లు రెడీ చేశారు.