కేటీఆర్ ను రేవంత్ రెడ్డి టచ్ కూడా చేయడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ ఆఫీస్ ముందు కేటీఆర్ సవాలు విసిరి వెళ్ళాడు… కేటీఆర్ ను మీరే అరెస్ట్ చేయలేక పోతున్నారని చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేసింది ఏసీబీ కాదా… ఇప్పుడు ఎందుకు నీ కింద పని చేసే ఏసీబీ కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు… భయ పడుతున్నవా…అంటూ చురకలు అంటించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాసినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడ ఉన్నారు? వ్యక్తిగత దూషణలకు దిగితే ఉరుకునే ప్రసక్తే లేదని తెలిపారు. కిషన్ రెడ్డి తో పని కాదని అంటున్నారు .. ఆయన ఇంటికి ఎందుకు వెల్లావు ? అని నిలదీశారు. బోజనాలు చేసినంత సేపు మంచోడు… బోజనాలు అయ్యాక తీడతారా? ఇదేనా మీ సంస్కృతి ? అంటూ ప్రశ్నించారు. రేవంత్ సిద్ధాంతలపై చర్చకు సిద్ధమా? కేంద్ర ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. మీరు వంద మంది వచ్చిన మా పార్టీ నుంచి నేను ఒక్కన్నే వస్తా… టైం డేట్ ఫిక్స్ చేయండి అంటూ సవాల్ చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.