వరంగల్ జిల్లాలోని మామునురులో ఏర్పాటు చేయబోయే కొత్త ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎయిర్‌పోర్టుకు తెలంగాణ పోరుబిడ్డ అయినటువంటి రాణి రుద్రమదేవి పేరు పెట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అఫిషియల్‌గా ప్రపోజల్ పంపించాలని కవిత వెల్లడించారు. కాగా, కవిత ప్రపోజల్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కేవలం రాజకీయాల కోసమే ఆమె ఈ ప్రపొజల్‌ను పెట్టాలని కొందరు విమర్శలు చేస్తున్నారు.