నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న తాజా సినిమా ది ప్యారడైజ్. న్యాచురల్ స్టార్ నాని.. చూడడానికి పక్కింటి అబ్బాయిలా కనిపించే ఈ యంగ్ హీరో.. విన్నూతమైన.. విభిన్నమైన పాత్రలు, సోర్టీలు చేస్తూ.. అభిమానుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. ఈ తరుణంలోనే… కొత్త సినిమా ది ప్యారడైజ్ తోనే వచ్చారు. అయితే.. ఈ సినిమా నుంచి అదిరిపోయే గ్లింప్స్ వచ్చేశాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది ప్యారడైజ్.

తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను చిత్రం బృందం విడుదల చేశారు. ‘చరిత్రలో అందరూ చిలకలు, పావురాలు గురించి రాసి ఉంటారు గానీ, కానీ అదే జాతిలో కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ’. అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.