నిర్మాత కేదార్ మృతిపైన సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై తాజాగా దుబాయ్ పోలీసులు స్పందించారు. కేదార్ మృతిపై విచారణ జరిపి ఎలాంటి కుట్ర లేదని క్లీన్ చిట్ ఇచ్చారు దుబాయ్ పోలీసులు. నిర్మాత కేదార్ మృతి విషయంలో మిస్టరీగా ఉన్నాయంటూ మీడియాతో చిట్ చాట్ చేస్తూ చెప్పారు రేవంత్ రెడ్డి. అంతేకాదు కేటీఆర్ కు సంబంధం ఉందని కూడా కొందరు నాయకులు ప్రచారం చేసారు.

ఇలాంటి నేపథ్యంలోనే… కేదార్ మృతిపై ఓ క్లారిటీ వచ్చింది. కేదార్ మరణం పై ఎలాంటి అనుమానాలు లేవని తేల్చిన దుబాయ్ పోలీసులు… కేదార్ ది సహజ మరణమే అని తేల్చారు. కేదార్ భార్య రేఖా వీణకు మృతదేహాన్ని అప్పగించారు దుబాయ్ పోలీసులు. భారత ప్రభుత్వ అనుమతితో కేదార్ భార్యకు మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు. దుబాయ్ లోని కేదార్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు భార్య కుటుంబ సభ్యులు.