మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసు లో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న మృతి చెందారు. కొన్ని రోజులుగా రంగన్న అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ మేరకు ఆయన కడప రిమ్స్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు పరిస్థితి విషమించడంతో రంగన్న మృతి చెందారు. రంగన్న మృతి ని వైద్యులు ధృవీకరించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివేకానందారెడ్డి ఇంట్లో రంగన్న సుదీర్ఘకాలం పని చేశారు. వివేకా హత్య సమయంలో ఆయనే ప్రధాన సాక్షిగా ఉన్నారు. వివేకా కేసులో రంగన్నను అధికారులు పలుమార్లు విచారించారు.
2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందారెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఇంట్లోని బాత్ రూమ్లో రక్తపు మడుగులో ఉన్న వివేకానందారెడ్డి మృత దేహాన్ని పోలీసులు పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరిగింది. చివరకు సీబీఐ అధికారుల చేతికి కేసు చేరింది. ఆ తర్వాత విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో పలువురు అరెస్ట్ అయి బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే వివేకానందారెడ్డి హత్య కేసులో మొత్తం 23 మందిని విచారించారు. ఈ నేపథ్యంలో ప్రధాన సాక్షి రంగన్న మృతి చెందడం బాధితుల్లో ఆందోళన కలిగిస్తోంది.