Telangana High Court: రేవంత్ రెడ్డికి షాక్‌…లగచర్ల, హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు

-

Telangana High Court: లగచర్ల, హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు అయింది. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లగచర్ల, హకీంపేటలో భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది హైకోర్టు. భూసేకరణపై స్టే ఇచ్చిన తెలంగాణ హైకోర్టు… లగచర్ల, హకీంపేటలో భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. దీంతో… తెలంగాణ రాష్ట్ర సర్కార్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

Telangana High Court: Lagacharla, Hakimpet land acquisition notification cancelled

 

లగచర్లలో మొదట ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్‌. అల్లుడి కంపెనీ కోసం భూసేకరణ అంటూ ఆరోపణలు, లగచర్ల రైతులు ఎదురు తిరగడంతో వెనక్కి తగ్గింది ప్రభుత్వం. మళ్లీ ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట భూసేకరణ మొదలు పెట్టింది ప్రభుత్వం. ఈ తరుణంలోనే… భూసేకరణ ఆపాలని స్టే ఇచ్చింది హై కోర్టు. కాగా.. లగచర్ల లో భూసేకరణ చేయడానికి వచ్చిన వికారాబాద్‌ కలెక్టర్‌ ను అక్కడి గ్రామాస్తులు తరిమేసిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news