కాకినాడలో వైసీపీకి మరో షాక్ తగిలిందది. రేపు జనసేనలో చేరనున్నారు వైసీపీ పార్టీకి చెందిన ఓ బడా నేత. ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. రేపు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తో కలిసి జనసేనలో చేరనున్నారు అనుబాబు.

తాజాగా… పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ఎంపీపీలు ,జెడ్పిటిసిలు, 25 మంది సర్పంచ్ లు, 20 మంది ఎంపీటీసీలు వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే 14 మంది పిఠాపురం గొల్లప్రోలు కు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. అటు మున్సిపల్ లో బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు దొరబాబు. రేపు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తో కలిసి జనసేనలో చేరనున్నారు అనుబాబు. అనంతరం బల ప్రదర్శన ఉండే ఛాన్సు ఉంది.