తనపై వచ్చిన లైంగిక ఆరోపణల వివాదంపై తాజాగా జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన విషయాలు వెల్లడించారు. తనకు, లక్ష్మీరెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని, అంతకుమించి మరొకటి లేదని వివరించారు. ఒక మహిళను రాజకీయాల్లో లాగి అనేక రకాలుగా హింసకు గురి చేశారని చెప్పారు.
తాను మొండోడిని కాబట్టి నిలబడ్డా.. ఇంకెవరైనా అయితే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటారని పేర్కొన్నారు.తనపై ఎవరు కుట్ర చేశారో పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా బయటపెడుతానని కిరణ్ రాయల్ స్పష్టంచేశారు. కాగా, కిరణ్ రాయల్ వ్యాఖ్యలపై కొందరు పాజిటివ్‌గా , మరికొందరు నెగెటివ్‌గా స్పందిస్తున్నారు.
https://twitter.com/bigtvtelugu/status/1897564021605453993