చంద్రబాబు నాకు తమ్ముడి లాంటి వాడు : మాజీ ప్రెసిడెంట్ వెంకయ్య

-

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఆయన స్టేజీ మీద మాట్లాడుతూ..చంద్రబాబు తనకు తమ్ముడు లాంటి వాడని వెల్లడించారు.చంద్రబాబు అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అని, రాష్ట్రం అనేక ఆర్ధిక కష్టాల్లో ఉందని వివరించారు.


ప్రజలందరూ ఏపీ ప్రభుత్వానికి సహకరించాలని, కేంద్ర సహాయంతో ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే ప్రజలంతా మాతృభాషకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు..

Read more RELATED
Recommended to you

Latest news