ఈత కొట్టేందుకు సరదాగా వెళ్లిన స్నేహితుల్లో ఒకరు అనుకోకుండా ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం వద్ద చోటుచేసుకుంది.
మల్కారం వద్ద ఉన్న గుట్టల్లో ఫోటో షూట్ కోసం సరదాగా వచ్చిన తిరుమలగిరి ప్రాంతానికి చెందిన యతిన్.. తన ముగ్గురు స్నేహితులతో కలిసి క్వారీలో ఈత కొడుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు యతిన్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దీంతో భయాందోళనకు గురైన మిగతా మిత్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. తోటి స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.