కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేశాడు. అలా సుమారు కొద్ది క్షణాల పాటు కింద దిగేందుకు ప్రయత్నించాడు.ట్రైన్ వేగం అధికంగా ఉండటంతో నెమ్మదించాక దిగుతామని అనుకున్నాడు.
తీరా ఓ స్టేషన్ వద్దకు రాగానే రైలు వేగం తగ్గింది. దీంతో నేలపై దిగబోయి వెనక్కి పడిపోయాడు.ఈ ఘటన యూపీలోని కాస్గంజ్, కాన్ఫూర్ స్టేషన్ల మధ్య జరిగింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అతని మీద కేసు ఫైల్ చేసి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇలాంటి ప్రమాదకమైన స్టంట్స్ చేయడం నేరమని రైల్వే పోలీసులు చెబుతున్నారు.
https://twitter.com/ChotaNewsApp/status/1899302084778053782