నేను మీలాగా ఢిల్లీకి పైసలు మోసే మనిషిని కాదు.. కాంగ్రెస్‌ నేతలకు ఆర్ఎస్పీ కౌంటర్

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించడంతో మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ రాజకీయ భవిష్యత్ మీద కాంగ్రెస్ శ్రేణులు ట్రోల్ చేయడం ప్రారంభించారు.ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై జరుగుతున్న ట్రోలింగ్ మీద మంగళవారం స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ, నేతల మీద తీవ్రంగా ఫైర్ అయ్యారు.

తన రాజకీయ భవిష్యత్ మీద గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిల్లర వేషాలను కాంగ్రెస్ నేతలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో.. ఏ వర్గాల భవిష్యత్తు కోసం పని చేయాలో క్లారిటీ ఉందని, మీ లాగా పదవుల కోసం ఢిల్లీకి మూటలు మోసే సంస్కృతి తనకు లేదన్నారు. అన్ని పైసలు కూడా తన వద్ద లేవని స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news