తెలంగాణ అధికారిక చిహ్నాన్ని విద్యాశాఖ అనధికారికంగా మార్చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రవీంద్ర భారతిలో కొత్తగా నియామకమైన 1,292 మంది జూనియర్ లెక్చరర్లు, 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, దీనికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలంగాణ అధికారిక చిహ్నాం గుర్తుపట్టలేకుండా మారిపోయిన దర్శనమించింది. దీంతో విద్యాశాఖ తీరుపై సోషల్ మీడియా వేదికగా కొందరు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వ లోగోను మార్చి ఎలా ఇస్తారని, ఎవరి అనుమతులు తీసుకున్నారని నిలదీస్తున్నారు.
https://twitter.com/TeluguScribe/status/1899684161482379740